Tesla: అమెరికాలో టెస్లా సంస్థపై దాడులు... 1 y ago
అమెరికాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో కార్లకు కొందరు దుండగులు నిప్పంటించారు. టెస్లాకు వ్యతిరేకంగా పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. లాస్ వెగాస్లో టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించగా, ఒకరు అభ్యంతరకర పదజాలంతో స్ప్రే పెయింట్ వేశారు. కాన్సాస్ సిటీలో రెండు టెస్లా సైబర్ ట్రక్కులను దుండగులు తగలబెట్టారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలపై స్థానిక పోలీసులు, ఎఫ్బీఐ, ఇతర విభాగాలతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు.